- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏనుగుల మధ్య పరుగు పందెం.. దద్దరిల్లిన ఆలయ ప్రాంగణం (వీడియో)
రెండు గుర్రాల మధ్య, రెండు ఎద్దుల మధ్య, ఆఖరికి రెండు కోళ్ల మధ్య కూడా పోటీలు జరుగడం చూశాం.

దిశ, వెబ్‌డెస్క్: రెండు గుర్రాల మధ్య, రెండు ఎద్దుల మధ్య, ఆఖరికి రెండు కోళ్ల మధ్య కూడా పోటీలు జరుగడం చూశాం. కానీ రెండు ఏనుగుల మధ్య పోటీలు జరుగడం ఎక్కడా చూసి ఉండరు. తాజాగా ఇలాంటి పోటీలే కేరళ(Kerala)లో నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. కేరళలోని పవిత్రమైన వైష్ణవ క్షేత్రాల్లో గురువాయూరు(Guruvayur Temple) ఒకటి. ఇది త్రిసూర్(Thrissur)కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణాది ద్వారకగా పిలిచే ఈ ప్రదేశంలో శ్రీ కృష్ణుడు(Shri Krishna) గురువాయురప్పన్‌గా పూజలందుకుంటున్నాడు.
తాజాగా ఈ ఆలయంలో ఏనుగుల మధ్య పరుగు పందెం(Elephant Racing) పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను చూసేందుకు జనాలు సైతం ఎగబడిపోయారు. ఏనుగులు కూడా ఏ ఒక్కటీ తగ్గకుండా ‘నువ్వా నేనా’ అనే స్థాయిలో పరుగెత్తి దుమ్మురేపాయి. పోటీల్లో ఏది గెలిస్తే అది స్వామివారి రథం అవుతుంది. దీంతో అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






