- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్సవాల్లో ఏనుగుల యుద్ధం!
కేరళ రాష్ట్రంలో ఏనుగులతో దేవతల ఊరేగింపు ఉత్సవాలు కనుల పండుగగా జరుపుతారు. అయితే తాజాగా అరట్టుపుజా ఆలయ ఉత్సవాల్లో దేవలతను ఊరేగింపు సందర్భంగా ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ రాష్ట్రంలో ఏనుగులతో దేవతల ఊరేగింపు ఉత్సవాలు కనుల పండుగగా జరుపుతారు. అయితే తాజాగా అరట్టుపుజా ఆలయ ఉత్సవాల్లో దేవలతను ఊరేగింపు సందర్భంగా ఏనుగులు బీభత్సం సృష్టించాయి. నిన్న త్రిస్సూర్‌లోని తారక్కల్ ఆలయ ఉత్సవాల ముగింపు దశకు చేరుకున్నాయి. గ్రాండ్ లైటింగ్, సౌండ్స్‌తో ఉత్సవాలు నిర్వహించారు. అయితే ఒక్కసారిగా దేవతను ఊరేగించే ఓ ఏనుగు మరో ఏనుగు పై దాడి చేసింది. రెండు ఏనుగులు కోట్లాడంతో ఏనుగులపై కూర్చుని ఉన్న వ్యక్తులు నేలపైకి విసిరిపడ్డారు.
ఈ క్రమంలోనే ఏనుగులు సృష్టించిన భీభత్సవం వల్ల పలువురు గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఉత్సవాల్లో ఏనుగులను మావటి కంట్రోల్ చేయలేకపోయారు. తర్వాత ఉత్సవాలు జరిగే ప్రదేశం నుంచి ఏనుగులు బయటకు ఒక కిలోమీటరు వరకు పరుగులు తీసినట్టు సమాచారం. అనంతరం ఏనుగులను మావటీలు అదుపులోకి తెచ్చినట్లు తెలిసింది.






