మగాళ్లను రక్షించండి.. ప్రధానికి లేఖ రాసి వ్యక్తి సూసైడ్

by Sujitha Rachapalli |

రాజస్థాన్‌ చిత్తోర్‌గఢ్‌కు చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ సరిత్ చిప్పా సూసైడ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భార్య మాలతో పెళ్లి, విడాకులు, డబ్బు చెల్లింపుల విషయంలో ఒత్తిడికి గురైన ఆయన.. చెన్నైలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి ముందు ఆత్మహత్య లేఖలు రాయడంతోపాటు తాను ఎదుర్కొన్న

మగాళ్లను రక్షించండి.. ప్రధానికి లేఖ రాసి వ్యక్తి సూసైడ్
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్‌ చిత్తోర్‌గఢ్‌కు చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ సరిత్ చిప్పా సూసైడ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భార్య మాలతో పెళ్లి, విడాకులు, డబ్బు చెల్లింపుల విషయంలో ఒత్తిడికి గురైన ఆయన.. చెన్నైలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి ముందు ఆత్మహత్య లేఖలు రాయడంతోపాటు తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓ వీడియో రిలీజ్ చేశాడు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీకి రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ యువత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ముందుకు ఎలా సాగుతారు? విడాకులు మాత్రమే ఆప్షన్ అనుకున్నప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? మగాళ్లు చనిపోతున్నారు.. దయచేసి వారిని రక్షించండి’ అంటూ తన బాధను, వివాహ బంధంలో పెరుగుతున్న భారాల గురించి చర్చించాడు. భార్య కారణంగా పడిన మానసిక వేదన గురించి చెప్పాడు. మగాళ్ల జీవితాలకు విలువ లేదంటూ వీడియో రిలీజ్ చేశాడు. కాగా ఈ కేసును అతుల్ సుభాష్‌ కేసుతో పోలుస్తున్నారు నెటిజన్లు. ఇంకెంత మంది చనిపోతే దేశంలో మగాళ్లకు న్యాయం దొరుకుతుందని ప్రశ్నిస్తున్నారు.

Next Story