ఇవాళ‌ బంగ్లాదేశ్ లో ఎన్నిక‌లు..ఆ పార్టీదే దూకుడు

by velandi.Saikiran |

ఇవాళ బంగ్లాదేశ్ లో ( Bangladesh) 13వ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.

ఇవాళ‌ బంగ్లాదేశ్ లో ఎన్నిక‌లు..ఆ పార్టీదే దూకుడు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: బంగ్లాదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్. ఆ దేశంలో హింసకాండ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. బంగ్లాదేశ్ లో ఇవాళ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఆ దేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం బంగ్లాదేశ్ వ్యాప్తంగా జరిగే ఈ ఎన్నికల కోసం దాదాపు పది లక్షల మంది భద్రత సిబ్బంది రంగంలోకి దిగారు. ఎలాంటి హింసకాండ జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం.

బంగ్లాదేశ్ లో వాళ్ళదే లీడింగ్

ఇవాళ బంగ్లాదేశ్ లో ( Bangladesh) 13వ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ పోటీలో లేదు. అటు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఒకప్పటి మిత్ర పార్టీ జమాత్ ఏ ఇస్లామిలు మాత్రమే పోటీ చేస్తున్నాయి. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ కచ్చితంగా ఉంటుంది. షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత జరిగే మొదటి ఎలక్షన్ ఇదే. దీంతో ఇండియాతో పాటు ఇతర దేశాలకు కూడా బంగ్లాదేశ్ పరిస్థితులపై కన్నేశాయి.

ఇవాళ మొత్తం 350 సీట్లకు గాను 299 స్థానాలలో ఎన్నికలు జరుగుతాయి. ఇక మరో 50 స్థానాలను మహిళలు కేటాయించారు. వీటి ఎంపిక పరోక్షంగా జరుగుతుంది. ఇక ప్రాథమిక సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ నేషనల్ లిస్టు పార్టీ గెలిచి, అధికారంలోకి వస్తుందని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక సర్కార్ అవామీ లీగ్ పార్టీని రద్దు చేసిన సంగతి విధితమే.

Next Story