బిహార్ ఎలక్టోరల్ రోల్స్ డ్రాఫ్ట్ విడుదల.. 65 లక్షల ఓట్లు మిస్సింగ్!

by Phanindra |

బిహార్ ఎలక్టోరల్ రోల్స్ డ్రాఫ్ట్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంట్లో 65 లక్షల ఓట్లు మిస్సింగ్ అని తెలుస్తోంది.

బిహార్ ఎలక్టోరల్ రోల్స్ డ్రాఫ్ట్ విడుదల.. 65 లక్షల ఓట్లు మిస్సింగ్!
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో ఎలక్టోరల్ రోల్స్ డ్రాఫ్ట్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పూర్తయిన నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకూ శుక్రవారం నాడు ఈ డ్రాఫ్ట్‌ను అందజేసింది. ఓటర్లకు కూడా దీన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్‌ 1లోగా ఈసీకి తెలియజేయవచ్చు. ఆ తర్వాత ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రచురిస్తుంది.

ఈ డ్రాఫ్ట్ జాబితాలో మొత్తం 65లక్షల ఓటర్లు తగ్గినట్లు వెల్లడైంది. ఎస్‌ఐఆర్‌‌కు ముందు రాష్ట్రంలో మొత్తం 7.9 కోట్ల ఓటర్లు ఉండగా, తాజా డ్రాఫ్ట్‌లో ఆ సంఖ్య 7.24కోట్లకు తగ్గింది. బిహార్ రాజధాని పట్నాలో అత్యధికంగా 3.95 లక్షలు, మధుబనీలో 3.52 లక్షలు, ఈస్ట్‌ చంపారన్‌లో 3.16 లక్షలు, గోపాల్‌గంజ్‌లో 3.10 లక్షల ఓటర్లు.. సంబంధిత పత్రాలను అందించకపోవడంతో వారిని ఈ జాబితాలో చేర్చలేదని ఈసీ తెలిపింది.

మొత్తం జాబితాలో 22.34 లక్షల మంది ఓటర్లు చనిపోయారని, 36.28 లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడం లేదా ఆయా చిరునామాలో లేరని ఈసీ గుర్తించింది. మరో 7.01 లక్షల మంది ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదైనట్లు గుర్తించామని తెలిపింది.

Next Story