ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్నిలర్స్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్నికల సంఘం

by Malleboina Mahesh |   (  Updated:2025-10-28 09:25:17  IST  )

గత కొంత కాలంలో ఢిల్లీలో ఖాళీగా ఉన్న మున్సిపల్ కౌన్సిలర్ స్థానాల భర్తీపై కీలక నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్నిలర్స్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్నికల సంఘం
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలంలో ఢిల్లీలో ఖాళీగా ఉన్న మున్సిపల్ కౌన్సిలర్ స్థానాల భర్తీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉన్న 12 కౌన్సిలర్ స్థానాలను భర్తీ చేయడానికి ఉప ఎన్నికల తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల దాఖలు ప్రారంభం నవంబర్ 3న, నామినేషన్ల దాఖలు చివరి తేదీ నవంబర్ 9, నామినేషన్ల పరిశీలన నవంబర్ 11న, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 14గా నిర్ణయించారు. ఓటింగ్ నవంబర్ 30న, ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరుగనున్నట్లు ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఈ ఉప ఎన్నికలు ప్రధానంగా గత ఎన్నికల్లో విజయం సాధించిన కొందరు కౌన్సిలర్లు ఎమ్మెల్యేలుగా, ఇతర పదవులకు ఎంపిక కావడంతో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయడానికి నిర్వహించబడుతున్నాయి. ఈ ఎన్నికలు ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీ ప్రాంతాల్లోని వివిధ వార్డులలో జరగనున్నాయి. ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఎన్నికల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల సిద్ధత వంటి అంశాలపై MCD మరియు పోలీస్ అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలు రాజధానిలో స్థానిక రాజకీయ సమీకరణాలకు కీలకమైనవిగా భావిస్తున్నారు.

Next Story