24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల.. 18న పోలింగ్

by Naga Rani Yarlagadda |

ఆరు రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.

24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల.. 18న పోలింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో 24 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగేసి స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మూడేసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 8వ తేదీ వరకూ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. నామినేషన్ల స్క్రూటినీ జూన్ 9న చేపట్టనుంది. జూన్ 11వ తేదీ వరకూ అభ్యర్థులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకునేందుకు గడువు ఇచ్చింది.

జూన్ 18న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్.. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించి తుది ఫలితాలను వెల్లడించనుంది. జూన్ 20వ తేదీ నాటికి రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.

కాగా.. ఏపీలో పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ ల పదవీకాలం ఈ నెల 26వ తేదీనాటికి ముగియనుంది. దీంతో ఈ నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. వీరి స్థానాల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎవరెవరిని నిలబెడుతుందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

Next Story