Election Commission: ఢిల్లీ ఎన్నికల వేళ ఏఐ వాడకంపై ఈసీ అడ్వైజరీ

by Shamantha N |

ఢిల్లీ ఎన్నికల వేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) ప్రచారంపై ఎన్నికల కమిషన్(Election Commission) అన్ని పార్టీలకు అడ్వైజరీ జారీ చేసింది.

Election Commission: ఢిల్లీ ఎన్నికల వేళ ఏఐ వాడకంపై ఈసీ అడ్వైజరీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎన్నికల వేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) ప్రచారంపై ఎన్నికల కమిషన్(Election Commission) అన్ని పార్టీలకు అడ్వైజరీ జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఏఐని వాడుతున్న పార్టీలు.. వారు సృష్టించే కంటెంట్‌ పారదర్శకంగా ఉండాలని సూచించింది. అంతేకాకుండా.. అభ్యర్థులు వాటిపై జవాబుదారీతనంతో వ్యవహరించాలని పేర్కొంది. ఏఐ టెక్నాలజీ ద్వారా క్రియేట్‌ చేసిన ఆడియో, వీడియోలు, చిత్రాలపై ఏఐ జనరేటెడ్‌, సింథటిక్ కంటెంట్‌ వంటి సంకేతాలను లేబుల్‌ చేయాలని తెలిపింది. ప్రచార ప్రకటనలను వ్యాప్తి చేసే సమయంలో సింథటిక్‌ కంటెంట్ వినియోగించినా దానికి డిస్‌క్లైమర్స్‌ ఇవ్వాల్సిందే అని వెల్లడించింది. ఎన్నికల వేళ బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ కొత్త నిబంధనలతో అడ్వైజరీ జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో (Election campaigning) కూడా ఆయా పార్టీలు ఏఐని వాడుతున్నాయి. కొన్నిసార్లు పార్టీలు సృష్టించే తప్పుడు కంటెంట్‌ ఓటర్ల అభిప్రాయాలను మార్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అప్రమత్తమైన ఈసీ (Election Commission) అడ్వైజరీ జారీ చేసింది.

ఫేక్ కంటెంట్ వల్ల..

కాగా.. ఏఐతో వ్యాప్తి చేసే ఫేక్ కంటెంట్ వల్ల కలిగే నష్టాల గురించి ఇటీవల ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌ కూడా హెచ్చరించారు. నకిలీ కంటెంట్‌, తప్పుడు సమాచారం ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. అయితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలు ఏఐని వినియోగిస్తున్నాయి. దీనిలో నకిలీ కంటెంట్‌ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్ సభ ఎన్నికల సమయంలోనూ ఈసీ ఇలాంటి మార్గదర్శకాలే జారీ చేసింది. సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు వేదికగా నైతికత, బాధ్యతయుతంగా నడుచుకోవాలని సూచించింది.

Next Story