BREAKING: ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-30 09:24:18  IST  )

ఓటర్ల జాబితా సవరణపై భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.

BREAKING: ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఓటర్ల జాబితా సవరణపై భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రానున్న ఎన్నికల దృష్ట్యా, ఓటర్ల జాబితాలో తమపేర్లు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడానికి ప్రజలకు మరింత సమయం కల్పిస్తూ 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఓటర్ సవరణకు అవకాశమిస్తూ.. గడువును వారంరోజులు పొడిగించింది.

పొడిగించిన గడువు అండమాన్ - నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లకు వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. డిసెంబర్ 11 వరకూ ఓటర్ల ఎన్యూమరేషన్ కాలాన్ని పొడిగించింది. 16న ముసాయిదా జాబితాను విడుదల చేయనుంది. ఫిబ్రవరి 7, 2026వరకు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఓటర్ జాబితాలోని అభ్యంతరాలు, ఎన్యూమరేషన్ ఫారమ్ లను పరిష్కరించాల్సి ఉంటుంది.

వేతనాల చెల్లింపుపై ఈసీఐ అసంతృప్తి

తృణమూల్ కాంగ్రెస్ (AITC) ప్రతినిధి బృందంతో నవంబర్ 28న జరిగిన సమావేశంలో ECI కీలక వ్యాఖ్యలు చేసింది. బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLOs) గౌరవ వేతనాల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై ECI తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. "ECI ఆమోదించిన BLOల వార్షిక గౌరవ వేతనం రూ.12,000, SIR కోసం అదనంగా రూ.6,000 ను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. దీనిని ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే చెల్లించాలి," అని ECI స్పష్టం చేసింది. ఈ గౌరవ వేతనాన్ని ECI గతంలోనే పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. క్షేత్ర స్థాయిలో నిష్పాక్షికమైన, పారదర్శకమైన ఓటరు జాబితా తయారీలో కీలక పాత్ర పోషించే BLOలకు వేతనం చెల్లించడంలో జరుగుతున్న ఈ ఆలస్యంపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది.




Next Story