Election Commission: రాహుల్ గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం సవాల్

by Ramesh Naini |

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.

Election Commission: రాహుల్ గాంధీ ఆరోపణలపై ఎన్నికల సంఘం సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) స్పందించింది. బీజేపీతో కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కు అయిందని ఓట్లను దొంగిలిస్తున్నారని రాహుల్ ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు పలు చోట్ల ఓటర్ల జాబితా ఆధారంగా చేసుకోని ఈసీపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం రియాక్ట్ అయింది. గురువారం ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేస్తూ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తప్పు దారి పట్టించేదిగా ఉందని ఈసీ తెలిపింది. ఎన్నికల అక్రమాలపై అనుమానాలు ఉంటే ఆధారాలు చూపించాలని తెలిపింది. రుజువు చూపించి.. సంతకం చేసిన అఫిడవిట్ సమర్పించాలని సవాల్ చేసింది. ఎన్నికల అక్రమాలపై అనుమానాలు ఉంటే లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలని సూచించింది. కాగా, కర్ణాటకలోని మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను విశ్లేషించామని మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 11,965 డూప్లికేట్ ఓటర్లు, 40,009 నకిలీ, తప్పుడు చిరునామా, 10,452 బల్క్, సింగిల్ అడ్రస్, 4,132 తప్పుడు ఫోటోలు ఉన్న ఓటర్లు, మరో 33,692 ఓటర్ల ఫారమ్-6 దుర్వినియోగం చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ట్వీట్ లింక్..

Next Story