- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhutto: సింధూలో నీళ్లు పారకపోతే..రక్తం పారుతోంది.. భారత్ పై నోరు పారేసుకున్న పాక్
“సింధూలో నీళ్లు పారకపోతే, రక్తం పారుతోంది” అని భారత్ కు పాక్ మాజీ మంత్రి భారత్ పై నోరు పారేసుకున్నారు. ఇటీవల జరిగిన బహిరంగ సభలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చీఫ్, విదేశాంగశాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో-జర్దారి(Bilawal Bhutto) ఈ వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: “సింధూలో నీళ్లు పారకపోతే, రక్తం పారుతోంది” అని భారత్ కు పాక్ మాజీ మంత్రి భారత్ పై నోరు పారేసుకున్నారు. ఇటీవల జరిగిన బహిరంగ సభలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చీఫ్, విదేశాంగశాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో-జర్దారి(Bilawal Bhutto) ఈ వ్యాఖ్యలు చేశారు. సింధీ నదీ జలాలు విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ఖండించారు. దాన్ని ఏకపక్ష నిర్ణయం అంటూ తోసిపుచ్చారు. “సింధూ జలాలు మావే. అవి ఎప్పటికీ మా నీళ్లే అని, ఆ నదిలో మా నీళ్లు అయినా పారాలి లేక మీ రక్తమైనా పారాలి” అని బిలావల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆయన విమర్శలు గుప్పించారు. ఏ అంతర్జాతీయ సమాజం కూడా మోడీ "యుద్ధకాండ"ను, సింధూ జలాలు మళ్లించే ప్రయత్నాన్ని సహించదని భుట్టో అన్నారు. "భారతీయులే వేల సంవత్సరాల నాటి నాగరికతకు వారసులు అని మోడీ అంటున్నారు. కానీ, ఆ నాగరికత లర్కానాలోని మొహెంజో దారోలో ఉంది. మేం దాని నిజమైన సంరక్షకులం. మేం దాన్ని రక్షిస్తాం" అని చెప్పుకొచ్చారు.
బిలావల్ భుట్టో ఆరోపణలు
సింధూ నదిపై మరోసారి దాడి జరుగుతోందని బిలావల్ భుట్టో ఆరోపించారు. ఈసారి భారత్ ఆ ప్రయత్నానికి ఒడి గట్టిందన్నారు. పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అంశంలో పాకిస్థాన్‌ను తప్పుగా ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తమ దేశం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మోడీ తన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు పాకిస్థాన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు బిలావల్ పేర్కొన్నారు. దానిలో భాగంగానే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేశారన్నారు. మరోవైపు, అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు. అయితే, ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్నైనా రద్దుచేసుకునే హక్కు భారత్‌కు ఉంటుంది.
Read More..






