Prank: హస్టల్ లో బెడిసికొట్టిన ప్రాంక్.. 8 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు

by Prasad Jukanti |

తోటి విద్యార్థులు చేసిన ప్రాంక్ కారణంగా విద్యార్థులు శాశ్వతంగా కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.

Prank: హస్టల్ లో బెడిసికొట్టిన ప్రాంక్.. 8 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హాస్టల్ లో తోటి విద్యార్థులు చేసిన ప్రాంక్ (Prank) బెడిసికొట్టడంతో 8 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. రాత్రిపూట విద్యార్థుల అరుపులతో వచ్చిన అధికారులు అక్కడ పరిస్థితి చూసి అందరూ షాక్ తిన్నారు. సరదా కోసం చేసిన పని ఇప్పుడు విద్యార్థులు శాశ్వతంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. ఒడిశాలోని (Odisha) కందమాల్ జిల్లా సలాగూడలోని సేవాశ్రమ పాఠశాలకు సంబంధించిన హాస్టల్ లో దారుణం జరిగింది. రాత్రిపూట నిద్రిస్తుండగా 3,4,5 తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థుల కళ్లలో తోటీ విద్యార్థులు ఇన్‌స్టంట్ గ్లూ పోశారు. దీంతో కళ్ల మంటతో మేల్కొన్న విద్యార్థులు తమ కంటిరెప్పలను మాత్రం తెరవలేక పోయారు. దీంతో భయాందోళనలతో అరుపులు, కేకలు వేయడంతో అప్రమత్తమైన అధికారులు వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వారిని ప్రత్యేక సంరక్షణ కోసం ఫుల్బానీలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థులను పరీక్షించిన వైద్యులు అతుక్కుపోయిన కనురెప్పలను విడదీశారు. జిగురు కారణంగా విద్యార్థుల కళ్లకు భారీగా నష్టం జరిగిందని సకాలంలో వైద్య సహాయం అందిస్తే పిల్లలకు శాశ్వతంగా దృష్టి కోల్పోకుండా నిరోధించవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఒక విద్యార్థి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో ఏడుగురు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఘటన నేపథ్యంలో కంధమాల్ జిల్లా యంత్రాంగం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోనరంజన్ సాహును సస్పెండ్ చేసింది. సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి విచారణ ప్రారంభించారు.

Next Story