మరో భారీ ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టులు మృతి

by Gantepaka Srikanth |

ఛత్తీస్‌‌గఢ్‌(Chhattisgarh)లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. శనివారం బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతం(Gangalur Forest Area)లో భద్రతా బలగాలు, మావోయిస్టుల(Maoists)కు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

మరో భారీ ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌‌గఢ్‌(Chhattisgarh)లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. శనివారం బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతం(Gangalur Forest Area)లో భద్రతా బలగాలు, మావోయిస్టుల(Maoists)కు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌(Encounter)లో దాదాపు ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. గంగలూర్ ఫారెస్ట్‌లో మావోయిస్టులు రహస్యంగా సమావేశమయ్యారనే సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసులను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు సైతం ఎదురుకాల్పులకు దిగారు. ఇప్పటివరకు 8 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు నిర్ధారించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

కాగా, ఇటీవల కాలంలో వరుసగా ఎన్‌కౌంటర్‌(Encounter)లు చోటుచేసుకుంటున్నాయి. మావోయిస్టులతో పాటు పలువురు పోలీసు అధికారులు, సామన్య పౌరులు కూడా మృతిచెందుతున్నారు. మొన్నటికి మొన్న ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం 14 మంది నక్సలైట్లు మృతి చెందారు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్‌, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి అలియాస్ రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం గతంలో రూ.కోటి రివార్డు ప్రకటించింది.

కేంద్ర సరిహద్దు జిల్లాలైన గరియాబంద్‌, నౌపాడలో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా పోలీసులు(Odisha Police), సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి తరచుగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి. కాల్పుల అనంతరం భారీస్థాయిలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్‌లో వెయ్యికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు సమాచారం.

Next Story