వరుస ఎన్‌కౌంటర్ల ఎఫెక్ట్.. లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు

by Kema Shiva Kumar |

దేశంలో మావోయిస్టుల (Maoists) నిర్మూలనకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) ఊహించని ఫలితాలు వస్తున్నాయి.

వరుస ఎన్‌కౌంటర్ల ఎఫెక్ట్.. లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మావోయిస్టుల (Maoists) నిర్మూలనకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) ఊహించని ఫలితాలు వస్తున్నాయి. తెలంగాణ (Telangana)-ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సరిహద్దులోని దట్టమైన అడవుల్లో భద్రతా దళాలు అడుగడుగునా గాలిస్తున్నాయి. అదేవిధంగా కర్రిగుట్టలు, నారాయణపూర్ (Narayanapur) జిల్లాలోని మాఢ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో పదుల సంఖ్యల మావోయిస్టులతో పాటు అగ్రనేతలు నంబాల కేశవ రావు (Nambala Kesava Rao) లాంటి వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొత్తం 16 మంది మావోయిస్టులు ఇవాళ మధ్యాహ్నం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ‘నియాద్ నెల్లానార్’ (Niad Nellanar) పథకంలో భాగంగా ఆపరేషన్ చేయూత పేరుతో తక్షణ ఆర్థిక సాయం, జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో మావోయిస్టులు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. సరెండర్ అయిన వారిలో మొత్తం ఆరుగురిపై రూ.25 లక్షల రివార్డులు ఉన్నాయని.. దీంతో స్థానిక కెర్లపెండ గ్రామం నక్సల్స్‌ రహిత గ్రామంగా మారిపోయిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Next Story