- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాల ఎఫెక్ట్.. విషపూరిత నురగతో నిండిపోయి బీచ్
ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెల 21 నుంచి 22 మధ్య భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి.

దిశ, వెబ్ డెస్క్: ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెల 21 నుంచి 22 మధ్య భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. దీంతో వరదలు వచ్చి పెద్ద మొత్తంలో వరద నీరు సముద్రంలో కలిసింది. దీంతో తీర ప్రాంతాల్లో నీరు చేరి, సముద్రపు అలలతో కలిసిన మురికి నీరు తీరాన్ని కప్పేసింది. పట్టినపాక్కం నుండి శ్రీనివాసపురం వరకు ఉన్న తీర ప్రాంతంలో “విషపూరిత నురగ తో కప్పబడింది. అయితే ఈ వార్తలపై అధికారులు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. వర్షాల ప్రభావంతో సముద్రపు అలల్లో మురికి, రసాయనాలు, కాలుష్య నీరు కలవడం వల్ల తెల్లటి నురుగు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ, ఇది “విషపూరితమైనది” అని నిర్ధారించే ఆధారాలు లేవని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ శాఖ, చెన్నై కార్పొరేషన్ అధికారులు తీరప్రాంతాన్ని పరిశీలిస్తూ, నమూనాలు సేకరిస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం ఆ తీర ప్రాంతానికి చెందిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.






