- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress MLA resign: హోటల్ బుక్ చేస్తారా.. నటికి కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే వేధింపులు.. పదవి ఊస్ట్
నటికి అసభ్యకర మెసేజులతో వేధింపులకు గురి చేసిన కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే పదవి ఊస్ట్ అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తనను వేధిస్తున్నాడంటూ మలయాళ నటి, మాజీ జర్నలిస్ట్ రిని జార్జ్ (Rini George allegations) చేసిన ఆరోపణల నేఫథ్యంలో కేరళ కాంగ్రెస్ (Kerala Congress) ఎమ్మెల్యే రాహుల్ మమ్కూతతిల్ (Rahul Mamkootathil) తన పదవికి రాజీనామా చేశారు. పాలక్కాడ్ నియోజవకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తూనే కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. నటి ఆరోపణల నేపథ్యంలో తాజాగా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నా రాజీనామాను ఎవరు అడగలేదని చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ఏ చర్యకు పాల్పడలేదని రాహుల్ చెప్పుకొచ్చారు. నాపై అధికారిక ఫిర్యాదులు కూడా లేవని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకే తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు వివరించారు. ఎల్ డీఎఫ్ ప్రభుత్వం చేసిన తప్పులను బహిర్గతం చేయడానికి తనతో సహా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేస్తా వచ్చేయ్..
గత బుధవారం రాహుల్ పై నటి రిని జార్జ్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ యువ ఎమ్మెల్యే తనను ఫైవ్ స్టార్ హోటల్ కు రమ్మంటూ వేధిస్తున్నాడని, అశ్లీల మెసేజులు పంపిస్తూ ఇబ్బందిపెడుతున్నాడని సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. సదరు నేత ఆగడాలపై పార్టీకి ఫిర్యాదు చేసినా అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా మరిన్ని అవకాశాలు ఇచ్చారని ఆరోపించింది. అయితే ఆమె ఏ నాయకుడి పేరు ప్రస్తావించక పోయినా మరో రచయిత్రి హనీ భాస్కర్ తన ఫేస్ బుక్ పోస్టులో ఎమ్మెల్యే రాహుల్ పేరుని బహిరంగంగా ప్రస్తావిస్తూ మరికొన్ని ఆరోపణలు చేసింది. రాహుల్ తనతో ఇన్ స్టా గ్రామ్ లో అసభ్యకర రీతిలో చాట్ చేశారని, తన గురించి ఇతురలకు అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆణె ఆరోపించింది. జూన్9 వరకు రాహుల్ తో తనకు వ్యక్తిగత పరిచయం లేదని ఆ తర్వాత శ్రీలంక పర్యటన సందర్భంగా ఇన్ స్టా గ్రామ్ లో సంభాషణ ప్రారంభించాడని ఆరోపించారు. ఈ క్రమంలో అతడు అసభ్యకరమైన సందేశాలు పంపించాడని ఆరోపించింది. రాహుల్ పై వచ్చిన ఈ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని కేరళ బీజేపీ కార్నర్ చేసింది. ఈ క్రమంలో ఇవాళ అతడు తన పార్టీ పదవికి రిజైన్ చేశారు. మళయాలం సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే వేధింపుల అంశం తీవ్ర దుమారం రేపుతున్న వేళ తాజాగా నటికి యువ ఎమ్మెల్యే వేధింపుల అంశం కలకలం రేపుతోంది.






