Education: ఎన్ఈపీపై తమిళనాడు ప్రభుత్వం రాజకీయం చేస్తోంది.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

by B.Srinivas |

తమిళనాడు ప్రభుత్వం నూతన విద్యా విధానం (ఎన్ఈపీ)ని వ్యతిరేకిస్తూ రాజకీయం చేయడం సరికాదని ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్ అయ్యారు.

Education: ఎన్ఈపీపై తమిళనాడు ప్రభుత్వం రాజకీయం చేస్తోంది.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు ప్రభుత్వం నూతన విద్యా విధానం (NEP)ని వ్యతిరేకిస్తూ రాజకీయం చేయడం సరికాదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra pradhaan) ఫైర్ అయ్యారు. ఎన్ఈపీని దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తమిళనాడులోని ఒక విద్యార్థి బహు భాషలను నేర్చుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. విద్యార్థుల మధ్య పోటీని సృష్టించడానికి, సమాన స్థాయిని ఏర్పర్చడానికి ఒక ఉమ్మడి వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోడీ (Pm modi) ఊహించిన నూతన విద్యా విధానం మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తోందని నొక్కి చెప్పారు.

తమిళం అత్యంత పురాతన భాషలలో ఒకటి అని, కానీ రాష్ట్రంలోని విద్యార్థులు బహుభాషా నిపుణులుగా ఉండి, ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పు లేదని వెల్లడించారు. అది తమిళం, ఇంగ్లీష్ ఇతర భారతీయ భాషలు ఏవైనా కావొచ్చన్నారు. తమిళనాడులోకి కొంత మంది మిత్రులు రాజకీయం చేస్తు్న్నారని, కానీ ఎన్ఈపీ అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. తమిళనాడు ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని, దాని కారణంగానే కొత్త విద్యా విధాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు.

కాగా, ఎన్ఈపీలో ప్రతిపాదించబడిన త్రిభాషా సూత్రంపై కేంద్రం, డీఎంకే నేతృత్వంలోని నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఎన్ఈపీని అంగీకరించకపోతే నిధులు విడుదల చేయడానికి నిరాకరిస్తూ కేంద్ర ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్రాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సీఎం స్టాలిన్ ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు.

Next Story