- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతీయ ఎన్జీవోకు ‘రామన్ మెగసెసే’ అవార్డు!
భారతీయ ఎన్జీవోకు ‘రామన్ మెగసెసే’ అవార్డు దక్కింది. స్కూల్ విద్య కొనసాగించలేకపోయిన గ్రామీణ మహిళలకు అండగా నిలుస్తున్న ‘ఎడ్యుకేట్ గర్ల్స్’.

దిశ, నేషనల్ బ్యూరో: మహిళలకు చదువు అందించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటైన ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్వచ్ఛంద సంస్థ చరిత్ర సృష్టించింది. ప్రఖ్యాత ‘రామన్ మెగసెసే’ అవార్డు అందుకున్న తొలి భారతీయ ఎన్జీవోగా నిలిచింది. సఫీనా హుస్సేన్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ.. గ్రామీణ ప్రాంతాల్లో స్కూలు విద్యకు దూరమైన బాలికలకు చదువు నేర్పించేందుకు కృషిచేస్తుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన సఫీనా.. 2005లో శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి భారత్‌కు తిరిగొచ్చింది.
మహిళలల్లో నిరక్షరాస్యత సమస్యను పరిష్కరించేందుకు 2007లో ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ సంస్థను ఆమె ఏర్పాటు చేసింది. ఈ సంస్థ 11 లక్షల మంది అమ్మాయిలకు విద్య నేర్పించి, దేశవ్యాప్తంగా 1.5 కోట్ల మందిపై ప్రభావం చూపించింది. స్కూల్ విద్యకు దూరమైన అమ్మాయిలను మళ్లీ స్కూళ్లలో చేర్పించి, వారికి అండగా నిలవడం ఈ సంస్థ చేసే పని. ఇలాంటి గొప్ప సేవ చేస్తున్న సంస్థకు ‘రామన్ మెగసెసే’ అవార్డు దక్కడం ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థకే కాదు, దేశానికి కూడా చరిత్రాత్మకమే అని హుసేన్ అన్నారు.






