వివరాలన్నింటిపై కవిత సంతకం తీసుకున్న ఈడీ

by Dishafeatures2 |
వివరాలన్నింటిపై కవిత సంతకం తీసుకున్న ఈడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కవిత నుంచి రాబట్టిన వివరాలన్నింటిపై ఆమె నుంచి సంతకాలను తీసుకున్నట్లు ఈడీ వర్గాలు అనధికారికంగా పేర్కొన్నాయి. ఏయే ప్రశ్నలకు ఆమె ఏం సమాధానం ఇచ్చిందీ రాతపూర్వకంగానే ఉన్నట్లు తెలిపాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడిగిన ప్రశ్నలకు ఆమె చెప్పాల్సిన సమాధానాన్ని ఆమె స్వదస్తూరితో రిప్లై రూపంలో తీసుకున్నామని, అలా రాబట్టిన అన్ని సమాధానాలకు సంబంధించిన పేపర్లపై సంతకాలు కూడా తీసుకున్నట్లు ఆ వర్గాలు వివరించాయి. ఆమె నుంచి స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేసుకున్నట్లు తెలిపాయి.



Next Story

Most Viewed