- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందని ఆరోపించిన బీజేపీ కార్యకర్తకు ఈడీ సమన్లు
రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందని ఉందని ఫిర్యాదు చేసిన బీజేపీ కార్యకర్తకు ఈడీ సమన్లు జారీ చేసింది. కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్ విఘ్నేష్ శిశిర్ అలహాబాద్ హైకోర్టులో రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడని,

దిశ, వెబ్ డెస్క్: రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందని ఉందని ఫిర్యాదు చేసిన బీజేపీ కార్యకర్తకు ఈడీ సమన్లు జారీ చేసింది. కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్ విఘ్నేష్ శిశిర్ అలహాబాద్ హైకోర్టులో రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడని, ఆయనను పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్ కు సంబంధించే విఘ్నేష్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఢిల్లీలోని దర్యాప్తు సంస్థ ముందు హాజరు కాావాలని పేర్కొంది.
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనల ప్రకారం ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నందున. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు, సరైన పత్రాలను విఘ్నేష్ సమర్పించాల్సి ఉంటుంది. ఏవైనా ఆర్థిక లావాదేవీలు లేదా విదేశాల నుండి అప్రకటిత ఆదాయం వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయా అనే దానిపై ఈడీ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అయితే గతంలో కూడా రాహుల్ పౌరసత్వానికి సంబంధించి ఆరోపణలు రాగా ఆయన మాత్రం ఖండిస్తూ వస్తున్నారు. కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగానే ఇలా చేస్తున్నారని చెబుతున్నారు.






