- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Karnataka Home Minister: కర్ణాటక హోంమంత్రికి షాక్
కర్ణాటక హోమంత్రి జి పరమేశ్వరకు చెందిన మెడికల్ కాలేజీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది.

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక హోమంత్రి జి పరమేశ్వరకు చెందిన మెడికల్ కాలేజీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా.. సోదాల సమయంలో కర్ణాటక హోం మంత్రి ఇంట్లో లేరని.. గుర్తు తెలియని ప్రదేశంలో ఆయన సహచరులతో భేటీ అయినట్లు సమాచారం. నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగానే మెడికల్ కాలేజీలో సోదాలు చేపట్టింది. దర్యాప్తు సమయంలో రన్యా రావుకు- పరమేశ్వరకు చెందిన మెడికల్ కాలేజీకి మధ్య లావాదేవీలు జరిగినట్లు ఈడీ పేర్కొంది. కాగా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆర్థిక రికార్డులను పరిశీలిస్తుంది.
గోల్డ్ స్మగ్లింగ్ కేసు
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో నటి రన్యా రావు అరెస్టయ్యింది. ఆ తర్వాత ఆమె ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరాలు తీసింది. మంత్రులు, రాజకీయ నాయకులతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు తేలింది. రన్యా రావు వివాహానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర హాజరైన విజువల్స్ బయటపడ్డాయి. దీంతో, గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కాంగ్రెస్ హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది.






