ED office: ఈడీ ఆఫీసులో అగ్ని ప్రమాదం.. కీలక ఫైళ్లు దగ్దం !

by B.Srinivas |

సౌత్ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ED office: ఈడీ ఆఫీసులో అగ్ని ప్రమాదం.. కీలక ఫైళ్లు దగ్దం !
X

దిశ, నేషనల్ బ్యూరో: సౌత్ ముంబై (South mumbai) లోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 2:31 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈడీ కార్యాలయం ఉన్న ఐదు అంతస్తుల కైజర్-ఎ-హింద్ భవనంలోని నాలుగో అంతస్తులో మంటలు వేగంగా వ్యాపించాయి. దీనిని గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్లు, ట్యాంకర్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు వెల్లడించనప్పటికీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ ఈడీ ఆఫీసులోని ఫర్నీచర్, అల్మారాలు, కీలకమైన ప్రభుత్వ ఫైళ్లు దగ్దమైనట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story