గూగుల్, మెటాకు మరోసారి ఈడీ నోటీసులు

by Muthe.Rajitha |

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల(Online Betting Apps)కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గూగుల్, మెటా (ఫేస్‌బుక్)(Google, Meta)కంపెనీల అధికారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) మరోసారి సమన్లు జారీ చేసింది.

గూగుల్, మెటాకు మరోసారి ఈడీ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల(Online Betting Apps)కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గూగుల్, మెటా (ఫేస్‌బుక్)(Google, Meta)కంపెనీల అధికారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఈడీ జులై 21న గూగుల్, మెటా ప్రతినిధులను ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సమన్లు జారీ చేసింది. కానీ ఈ రెండు కంపెనీల ప్రతినిధులు హాజరు కాలేదు. దీంతో, ఈడీ వారికి మరోసారి నోటీసులు జారీ చేసింది. జులై 28న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ అక్రమ బెట్టింగ్ యాప్‌లకు ప్రకటనల స్పేస్ అందించి, వాటి ప్రచారానికి సహకరించాయని ఈడీ ఆరోపిస్తోంది.

ఈ కేసులో బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 29 మంది ప్రముఖ వ్యక్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేసింది ఈడీ. వీరిలో ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్, ప్రణీత సుభాష్, మంచు లక్ష్మీ వంటి సెలబ్రిటీలు ఉన్నారు.

Next Story