దూకుడు పెంచిన ఈడీ.. బాలీవుడ్ స్టార్ హీరో‌కు నోటీసులు

by Malleboina Mahesh |

ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కేసు ప్రమోషన్స్ చేసిన కేసులో ఉన్న ప్రముఖులకు వరుసపెట్టి నోటీసులు అందజేస్తుంది.

దూకుడు పెంచిన ఈడీ.. బాలీవుడ్ స్టార్ హీరో‌కు నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్, మనీ లాండరింగ్ కేసుల (Money laundering cases)పై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం దూకుడు పెంచింది. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ (Betting Apps Promotions) చేసిన కేసులో ఉన్న ప్రముఖులకు వరుసపెట్టి నోటీసులు అందజేస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం మాజీ క్రికెటర్లు అయిన రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్ లకు నోటీసులు ఇవ్వగా తాజాగా బాలీవుట్ స్టార్ హీరో, సమాజ సేవకుడిగా పేరు తెచ్చుకున్న నటుడు సోనూ సూద్ (Actor Sonu Sood) కు నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో సెప్టెంబర్ 24న విచారణకు హాజరు కావాలని సోనూ సూద్ కు ఇచ్చిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఇది “1xBet” అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించి జరుగుతున్న మనీ లాండరింగ్ కేసులో భాగం.

ఇదే కేసులో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్‌ను సెప్టెంబరు 23న, రాబిన్ ఉతప్పను సెప్టెంబర్ 22న విచారణకు పిలిచింది. ఈ కేసు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద దర్యాప్తు జరుగుతోంది. ED అధికారుల సమాచారం ప్రకారం, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా వచ్చిన నిధులు, చెల్లింపులు, అలాగే సెలబ్రిటీలు చేసిన ప్రచారాలు, endorsementsలో వారి పాత్ర పై ప్రశ్నలు ఉంటాయి. సోనూ సూద్ యాప్ ప్రమోషన్‌లో భాగం అయ్యారా? ఆర్థిక లావాదేవీల్లో ఏవైనా వ్యత్యాసాలు ఉన్నాయా? అనే అంశాలపై ED దృష్టి సారించింది. ఈ కేసు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల దుర్వినియోగంపై మరోసారి చర్చను తెరపైకి తెచ్చింది.

Next Story