- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ED: అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశాలు
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani)కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఏజెన్సీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (Agency of Prevention of Money Laundering Act) కింద మరోసారి నోటీసులు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani)కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఏజెన్సీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (Agency of Prevention of Money Laundering Act) కింద మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. అయితే, రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు సంబంధించిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసిన రెండు రోజుల్లో అనిల్ అంబానీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అయితే, జప్తు చేసిన ఆస్తుల్లో ముంబయిలోని పాలీ హిల్‌లో అంబానీ నివాసం, రిలయన్స్ గ్రూప్ ఎంటీటీలకు చెందిన అనేక వాణిజ్య, నివాస ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా ఢిల్లీలోని మహారాజా రణజిత్ సింగ్ మార్గ్‌లోని రిలయన్స్ సెంటర్‌కు సంబంధించిన భూమి, ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ముంబయి, పూణే, థాణే, హైదరాబాద్, చెన్నై, ఈస్ట్ గోదావరి ప్రదేశాల్లోని దాదాపు రూ. 3,084 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. కాగా, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL) సేకరించిన రూ.5,010 కోట్ల నిధులను దారి మళ్లించినట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అనిల్ అంబానీపై ఈడీ విచారణ చేపడుతోంది.






