- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పై ED ఛార్జీషీట్
ప్రముఖ వ్యాపార వేత్త, కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఛార్జీషీట్ దాఖలు చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: యూకేకు చెందిన ఆయుధాల డీలర్ సంజయ్ భండారి సంబంధిత మనీలాండరింగ్ కేసులో, ప్రముఖ వ్యాపార వేత్త, కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఛార్జీషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఛర్జిషీట్‌ను ఇవాళ (గురువారం) ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించింది. దాఖలైన ఛార్జీషీట్‌ను తీసుకుని డిసెంబర్ 6న ఢిల్లీ కోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో ఇప్పటికే ఈ ఏడాది జూలైలో వాద్రాను సుమారు ఐదు గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. ఇది వాద్రాపై దాఖలైన రెండో మనీలాండరింగ్ ఛార్జిషీట్. హర్యానాలో షికోహ్‌పూర్‌లో జరిగిన భూ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని జూలైలో అతనిపై ప్రత్యేక ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. సంజయ్ భండారితో సంబంధం ఉన్న కేసులో గతంలో ఆయనను పలుసార్లు ప్రశ్నించారు. ఇక, 2016లో భండారిపై జరిగిన వరుస ఐటీ దాడుల నేపథ్యంలో ఈడీ దర్యాప్తు ప్రారంభమైంది. ఐటీ దాడులు జరిగిన వెంటనే 2016లో భండారీ (63) లండన్‌కు పరార్ అయ్యాడు. ఈ ఏడాది జూలైలో ఢిల్లీ కోర్టు అతన్ని పారిపోయిన ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించింది.






