దేశంలోకి ‘ఆర్థిక తుఫాన్’.. మోడీ విధానాలపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

by Ramesh Naini |

దేశ ఆర్థిక పరిస్థితిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలోకి ‘ఆర్థిక తుఫాన్’.. మోడీ విధానాలపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ ఆర్థిక పరిస్థితిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల దేశంలో త్వరలోనే భారీ ‘ఆర్థిక తుఫాన్’ రాబోతోందని, దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. మంగళవారం రాయ్‌బరేలీలో విలేకరులతో మాట్లాడిన ఆయన, ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక వ్యూహాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

సామాన్యుడిపైనే ఆర్థిక భారం..

ప్రధాని మోడీ మార్చిన ఆర్థిక నిర్మాణం (అదానీ-అంబానీ మోడల్) ఎక్కువ కాలం నిలబడదని, అది త్వరలోనే కుప్పకూలిపోతుందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. రాబోయే ఆర్థిక సంక్షోభం వల్ల మోడీకి కానీ, అదానీ-అంబానీలకు కానీ ఎటువంటి నష్టం జరగదని.. కేవలం సామాన్య ప్రజలు మాత్రమే అపూర్వమైన కష్టాలను ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, ప్రధాని తగిన చర్యలు తీసుకోకుండా ప్రజలను విదేశీ పర్యటనలు మానమంటున్నారని, కానీ ఆయనేమో ప్రపంచ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు.

Next Story