ఉప రాష్ట్రపతి ఎన్నికకు పరిశీలకుల నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ఈసీఐ

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-21 14:52:32  IST  )

ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది.

ఉప రాష్ట్రపతి ఎన్నికకు పరిశీలకుల నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ఈసీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటకే ఎన్డీఏ తరఫున సీపీ రాధాకృష్ణన్ బుధవారం నామినేషన్ దాఖలు చేయగా.. ఇవాళ ఇండియా కూటమి తరఫున జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఉప రాష్ట్రపతి ఎన్నికకకు పరిశీలకును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అబ్జర్వర్లుగా పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, ఐఏఎస్ సుశీల్ కుమార్ లోహాని, ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, ఐఏఎస్ డి.ఆనందన్, రూరల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ నితిన్ కుమార్ శివదాస్‌ ఎన్నికయ్యారు. రేపటి నుంచి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. 25న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించి అదే రోజుల ఫలితాన్ని వెల్లడించనున్నారు. ప్రస్తుతం రాజ్యసభ, లోక్‌సభలో కలిపి మొత్తం 786 ఎంపీలు ఉన్నారు. ఎన్నికల్లో ఉప రాష్ట్రపతిగా విజయం సాధించాలంటే 394 ఓట్ల మ్యాజిక్ ఫిగర్‌ను దాటాల్సి ఉంటుంది.

Next Story