- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
EC: ఎన్నికల ప్రక్రియపై సలహాలు, సూచనలు అందించండి.. రాజకీయ పార్టీలకు ఈసీ పిలుపు
ఇటీవల జరిగిన ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల అనంతరం ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన ఢిల్లీ (Delhi), మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓటర్ల జాబితా సహా ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేసేందుకు ఎలక్షన్ కమిషన్ (Election commission) చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియకు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చింది. వివిధ స్థాయిల్లో ఎన్నికల ప్రక్రియలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు సూచించింది. ఏప్రిల్ 30 నాటికి తమ సలహాలు, సూచనలు అందించాలని తెలిపింది. అన్ని సమస్యలపై పొలిటికల్ పార్టీలు తమ సూచనలను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారులకు తెలియజేయాలని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలను మరింత బలోపేతం చేయడానికి రాజకీయ పార్టీల అధ్యక్షులు, సీనియర్ లీడర్లతో చర్చలు జరిపే విషయాన్ని కూడా ఈసీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా, గత నెలలో ఢిల్లీలో ఓటమి పాలైన అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాలని ఆరోపించారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamatha benarjee) సైతం ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారని పలు మార్లు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఓటర్ లిస్ట్, ఈపీఐసీ నంబర్ల కేటాయింపుపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఈ అంశంపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈసీ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.






