- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
24 గంటలే గడువు.. ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు EC నోటీసులు
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) షాక్ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఈసీ, తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోడీని 'ఉగ్రవాది' (Terrorist) అని సంబోధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దేశ ప్రధానమంత్రిని అగౌరవపరచడమే కాకుండా, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (Model Code of Conduct) ఖర్గే ఉల్లంఘించారని బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బుధవారం నోటీసులు జారీ చేసిన ఈసీ.. 24 గంటల్లోగా సదరు వ్యాఖ్యలపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఖర్గేను ఈసీ ఆదేశించింది. బెంగాళ్, తమిళనాడు ఎన్నికల వేళ దేశంలోని ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో, స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడికే ఈసీ నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.






