ఈసీ కీలక నిర్ణయం..గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై చర్యలు

by Ajay Maddhiboyina |

కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గుర్తింపు లేని రాజ‌కీయ పార్టీల‌పై చ‌ర్య‌లు తీసుకుంటోంది. 2019 నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఎన్నిక‌లో కూడా పోటీ చేయని, గుర్తింపు

ఈసీ కీలక నిర్ణయం..గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై చర్యలు
X

దిశ, వెబ్ డెస్క్:కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గుర్తింపు లేని రాజ‌కీయ పార్టీల‌పై చ‌ర్య‌లు తీసుకుంటోంది. 2019 నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఎన్నిక‌లో కూడా పోటీ చేయని, గుర్తింపు లేని 345 రాజ‌కీయ పార్టీల‌ను డీలిస్ట్ చేసింది. ఆ పార్టీల‌కు కార్యాల‌యాలు కూడా లేవ‌ని గుర్తించి ఈసీ నిర్ణ‌యం తీసుకుంది. సాధార‌ణంగా ఒక పార్టీ గుర్తింపు పొందాలి అంటే ఎన్నిక‌ల్లో 6శాతం ఓట్ల‌ను సాధించాలి. అలా 6 శాతం ఓట్ల‌ను కూడా సాధించ‌ని పార్టీల‌ను న‌మోదిత‌ పార్టీలు అని పిలుస్తారు. ఇక‌ ఈసీ డీలిస్ట్ చేసిన గుర్తింపు లేని రాజ‌కీయ పార్టీల‌లో ప‌లు రాష్ట్రీయ పార్టీల‌తో పాటూ కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల‌కు చెందినవి కూడా ఉన్నాయి. అంతే కాకుండా కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద సుమారుగా 2800 గుర్తింపు లేని రాజ‌కీయ పార్టీలు ఉన్నాయి.

Next Story