రాహుల్ హైడ్రోజన్ బాంబ్ పై ఈసీ కౌంటర్

by Muthe.Rajitha |

వోట్ చోరీపై మరోసారి బిగ్ బాంబ్ పేల్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.

రాహుల్ హైడ్రోజన్ బాంబ్ పై ఈసీ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్ : వోట్ చోరీపై మరోసారి బిగ్ బాంబ్ పేల్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షలకుపైగా నకిలీ ఓట్లు చేర్చి ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. ఒక బ్రెజిలియన్ మోడల్ ఫోటోను 22 సార్లు వాడి సీమా, స్వీటీ, సరస్వతి పేర్లతో ఓటర్లుగా నమోదు చేశారని ‘హెచ్ ఫైల్స్’ పేరిట ఆధారాలు చూపిస్తూ బుధవారం ఎన్నికల సంఘం, భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ ల్యాండ్‌స్లైడ్ విజయం సూచించినా భాజపా గెలిచిందన్నారు. ఇందులో 5.21 లక్షల డూప్లికేట్ ఓట్లు, 93 వేల చెల్లని చిరునామాలు, 19 లక్షల బల్క్ ఓట్లు ఉన్నాయన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరిట భాజపాతో కుమ్మక్కై రిగ్గింగ్ జరిగిందని రాహుల్ ఆరోపించారు. కాగా రాహుల్ హైడ్రోజన్ బాంబ్ పై ఎన్నికల సంఘం కౌంటర్ ఇచ్చింది.

గతేడాది హరియాణా ఎన్నికలకు ముందు ఓటరు జాబితాపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని తెలిపింది. జాబితా కాపీలు అందరికీ ఇచ్చామని, డూప్లికేట్లపై ఎందుకు అప్పీల్ చేయలేదని నిలదీసింది. రాహుల్ SIRను సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించిన ఈసీ.. ఈ ఆరోపణలను నిరాధారమని, రుజువులతో అఫిడవిట్ ఇవ్వాలని లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

Next Story