Earthquake : మేఘాలయను వణికించిన భూకంపాలు

by Y. Venkata Narasimha Reddy |

ఈశాన్య రాష్ట్రం మేఘాలయ (Meghalaya)ను వరుస భూకంపాలు(Earthquakes) వణికించాయి.

Earthquake : మేఘాలయను వణికించిన భూకంపాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఈశాన్య రాష్ట్రం మేఘాలయ (Meghalaya)ను వరుస భూకంపాలు(Earthquakes) వణికించాయి. బుధవారం రాత్రి మేఘాలయలో భూకంపం సంభవించిన గంటల వ్యవధిలోనే గురువారం మరోసారి భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. గారో హిల్స్‌ (North Garo Hills)లో గురువారం ఉదయం 11:32 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.1గా నమోదైంది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు.

స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అయితే, ఈ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈశాన్య రాష్ట్రాలలో తరుచు భూకంపాలు రావడం పరిపాటి. అయితే వరుస భూకంపాలు సంభవించిన సందర్భాల్లో ప్రజలు కొంత భయాందోళనలకు గురవుతున్నారు.

Next Story