- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో మరోసారి భూకంపం(Earthquakes) సంభవించింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో మరోసారి భూకంపం(Earthquakes) సంభవించింది. శుక్రవారం ఎన్సీఆర్(NCR) పరిధిలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.7గా నమోదైంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, గురువారం కూడా ఎన్ సీఆర్ ప్రాంతాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 9.04కు నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, హర్యానాతోపాటు పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. హర్యానాలోని జజ్జర్‌కు ఈశాన్య దిశగా 4కిలోమీటర్ల దూరంలో, భూమి నుంచి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు ఈ రెండు భూకంపాల వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకపోవడం భారీ ఉపశమనం. భూకంప సమయాల్లో ప్రజలు ఆందోళనకు గురికావొద్దని, ఇలాంటి సమయాల్లో లిఫ్ట్‌కు బదులుగా మెట్లను ఉపయోగించాలని సూచించింది.






