- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పశ్చిమ బెంగాల్‌లో భూకంపం.. అనేక జిల్లాల్లో కంపించిన భూమి
by Ajay Maddhiboyina |
ఈరోజు ఉదయం బంగ్లాదేశ్‌లోని తుంగికి తూర్పున 27 కీలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు సంభవించాయి. బంగ్లాదేశ్ రాజధాని డాకా సమీపంలో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. దీంతో పశ్చిమ బెంగాల్ లోని అనేక జిల్లాల్లో భూమి కంపించింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఈరోజు ఉదయం బంగ్లాదేశ్‌లోని తుంగికి తూర్పున 27 కీలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు సంభవించాయి. బంగ్లాదేశ్ రాజధాని డాకా సమీపంలో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. దీంతో పశ్చిమ బెంగాల్ లోని అనేక జిల్లాల్లో భూమి కంపించింది. కోల్‌కతాలోనూ భూకంపం సంభవించింది. దీంతో కోల్ కతా సహా ఇతర జిల్లాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఉదయం 10.10 నిమిషాలకు భూమి కంపించగా ప్రకంపనలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం గౌహతి, అగర్తల, షిల్లాంగ్ లలో కూడా స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. అయితే ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
Next Story






