- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
రష్యాలో (Russia) భారీ భూకంపం (Earthquake) సంభవించింది.

X
దిశ, వెబ్ డెస్క్: రష్యాలో (Russia) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఇవాళ (జులై 30) రిక్టర్ స్కేలు 8.7 తీవ్రతతో భూప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. తూర్పు తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్‌క తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చింది. ఇది సముద్రం లోతులో సంభవించటంతో జపాన్, యుఎస్ ఏజెన్సీలు సునామీ (Tsunami) హెచ్చరికలు జారీ చేశాయి. తీర ప్రాంతంలో అలలు నాలుగు మీటర్ల మేర ఎగసిపడే అవకాశం ఉందని అంచనా వేసింది. హెచ్చరికలు ఎత్తివేసే వరకు ప్రజలు సముద్ర తీరానికి వెళ్లవద్దని సూచించింది. అయితే, ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. కాగా, 1952 నవంబర్‌లో కమ్చట్కాలో 9.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. నాడు హవాయిలో 9.1 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
Next Story






