పాకిస్థాన్‌లో మరోసారి భూకంపం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-03 05:23:11  IST  )

మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది.

పాకిస్థాన్‌లో మరోసారి భూకంపం
X

దిశ, వెబ్ డెస్క్: మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారు జామున (ఆగస్టు 03) ఇస్లామాబాద్‌ సమీపంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది. ఈ భూకంపం మధ్య రాత్రి 12:40 గంటల సమయంలో ప్రకంపనాలు రావటంతో ప్రజలు నిద్ర నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేశారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి, తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

కాగా, శనివారం (ఆగస్టు 2) సైతం పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్, ఇస్లామాబాద్‌లలో సైతం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదయింది. అయితే ప్రపంచంలో అత్యంత భూకంప క్రియాశీల దేశాలలో పాకిస్థాన్ కూడా ఒకటి. ఇక్కడ అనేక భారీ భూకంపాలు తరచూ సంభవిస్తూనే ఉంటాయి.

Next Story