- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మయన్మార్‌లో భూకంపం.. కోల్‌కతాలోనూ ప్రకంపనలు
మయన్మార్ లో కొన్ని సెకండ్ల పాటు భూ ప్రకంపనలు రావడం జరిగింది. దీంతో ఎత్తైన భవనాలలో నివసించే కొంత మంది భయంతో బయటకు పరుగులు తీశారు.

దిశ, వెబ్ డెస్క్: మయన్మార్ లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. కాసేపటి క్రితమే మయన్మార్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన తీవ్రత 6.1 గా భూకంపం నమోదు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ భూకంపం ప్రభావం తూర్పు, ఈశాన్య ఇండియాలోని పలు ప్రాంతాలపైన పడినట్లు సమాచారం అందుతోంది. మంగళవారం రోజున అర్ధరాత్రి కోల్ కతా, పరిసర ప్రాంతాలలో స్వల్ప భూకంపం చోటు చేసుకున్నట్లు అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు.
కోల్‌కతాలోనూ ప్రకంపనలు
అయితే మయన్మార్ లో కొన్ని సెకండ్ల పాటు భూ ప్రకంపనలు రావడం జరిగింది. దీంతో ఎత్తైన భవనాలలో నివసించే కొంత మంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ తరుణంలో ఈ భూకంపం కారణంగా ఇలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. దీనిపై మరి కొన్ని గంటల్లో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ భూకంపం ప్రభావం మాత్రం.. చాలా మంది అమాయక ప్రజలను ఆందోళనకు గురిచేసింది.






