- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మణిపూర్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదు
మణిపూర్‌లోని కమ్‌జోంగ్ జిల్లాలో నేడు తెల్లవారుజామున 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. 62 కి.మీ లోతులో ప్రకంపనలు చోటుచేసుకోగా, ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: మణిపూర్ రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించిన వివరాల ప్రకారం.. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. ఈ రోజు (ఏప్రిల్ 21, 2026) తెల్లవారుజామున 5:59 గంటలకు భూమి కంపించింది. మణిపూర్‌లోని కమ్‌జోంగ్ (Kamjong) జిల్లాలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇది ఉఖ్రుల్‌కు దక్షిణ-నైరుతి దిశలో 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూ అంతర్భాగంలో 62 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.తెల్లవారుజామున నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం సంభవించలేదు. మణిపూర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు కనిపించాయి.






