- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం: పుల్వామాలో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత నమోదు
by Kema Shiva Kumar |
జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో స్వల్ప భూకంపం సంభవించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లో ఇవాళ ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. పుల్వామా జిల్లా పరిధిలో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూమి కంపించినట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (National Centre for Seismology) వెల్లడించింది. భూగర్భంలో 5 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. భూప్రకంపనల ధాటికి ఇళ్లలోని సామాన్లు కదలడంతో ప్రజలు భయాందోళనలతో కాసేపు రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని స్థానిక పరిపాలన వర్గాలు ప్రాథమికంగా ధృవీకరించాయి. లోయ ప్రాంతంలో తరచూ ఇలాంటి స్వల్ప ప్రకంపనలు రావడం సహజమేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సూచించారు.
Next Story






