ఇరాన్‌, తజికిస్థాన్‌లో భూకంపం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-23 04:58:15  IST  )

ఇరాన్‌లో (Iran) భూకంపం (Earthquake) సంభవించింది.

ఇరాన్‌, తజికిస్థాన్‌లో భూకంపం
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్‌లో (Iran) భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున ఉత్తర ఇరాన్‌లో భూప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. భూమి లోపల నాలుగు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రబిందువు ఉన్నట్టు యూరోపియన్ మెడిటేరనియన్ సీస్మొలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయపడిపోయారు. చాలామంది ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్టు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలిపారు.

ఇక మరోవైపు తజికిస్తాన్‌లోనూ అదే సమయంలో భూప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రకంపనాలు రిక్టర్ స్కేలుపై 4 తీవ్రతతో నమోదైంది. దీని కేంద్రబిందువు భూమి లోపల 160 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు తెలుస్తోంది. లోతుగా జరిగిన భూకంపం కావడంతో ప్రభావం తక్కువగానే కనిపించింది. అయితే, ఇటీవల వరుస భూకంపాలు ప్రజల్లో భయం, ఆందోళన కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో మరింత పెద్ద ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Next Story