బిహార్‌లో కంపించిన భూమి.. ఉత్తరాది రాష్ట్రాల్లో వరుస ప్రకంపనలు

by Gantepaka Srikanth |

దేశంలో వరుస భూకంప(Earthquake) ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

బిహార్‌లో కంపించిన భూమి.. ఉత్తరాది రాష్ట్రాల్లో వరుస ప్రకంపనలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో వరుస భూకంప(Earthquake) ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలో భూకంపం సంభవించగా.. తాజాగా.. బిహార్‌(Bihar)లోని శివాన్‌లో దగ్గర సంభవించినట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 4.0 గా నమోదైనట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా జనం ఇళ్ల నుంచి భయంతో పరుగులు తీశారు.

కాగా, ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూప్రంకపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ(National Center for Seismology) సోషల్ మీడియా(X) వేదికగా తెలిపింది. భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమేనని స్పష్టం చేసింది. కొన్ని సెకన్ల పాటు మాత్రమే భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

దీంతో విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ(PM Modi).. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భద్రతా చర్యలు పాటించాలని, పరిస్థితులను అధికారులు సునిశితంగా పరిశీలిస్తున్నారని ప్రధాని మోడీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Next Story