న్యూ ఇయర్ వేళ జపాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతగా నమోదు

by Kema Shiva Kumar |

నూతన సంవత్సర వేడుకల ముందు జపాన్‌ (Japan)లో శక్తివంతమైన భూకంపం సంభవించింది.

న్యూ ఇయర్ వేళ జపాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతగా నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: నూతన సంవత్సర వేడుకల ముందు జపాన్‌ (Japan)లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (United States Geological Survey) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నోడా (Noda) ప్రాంతం తూర్పు తీరం సమీపంలో సముద్రంలో రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రం 19.3 కి.మీ లోతులో ఉందని, నోడా నగరానికి సుమారు 91 కి.మీ దూరంలో ఉన్నట్లుగా USGS అధికారులు పేర్కొన్నారు. ఈ భూకంపం కారణంగా ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. అదేవిధంగా ఆస్తి, ప్రాణ నష్టంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే, న్యూ ఇయర్ వేళ భూకంపంతో ప్రజలు సంబురాలకు దూరమై తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా, డిసెంబర్ 8న 7.5, డిసెంబర్ 12న 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి సునామీ హెచ్చరికలు జారీ అయిన విషయం తెలిసిందే.

Next Story