- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Earthquake: మణిపూర్‌లో భూ ప్రకంపనలు.. గంట వ్యవధిలోనే రెండు సార్లు కంపించిన భూమి
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ను భూ ప్రకంపనలు వణికించాయి. గంట వ్యవధిలోనే రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)ను భూ ప్రకంపనలు వణికించాయి. గంట వ్యవధిలోనే రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఉదయం 11:06 గంటలకు 5.7 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించగా దీని భూకంప కేంద్రం ఇంఫాల్ (Imphal) తూర్పు జిల్లాలోని యైరిపోక్‌కు తూర్పున 44 కి.మీ దూరంలో 110 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది. ఆ తర్వాత 12:20 గంటలకు 4.1 తీవ్రతతో రెండో భూకంపం సంభవించగా.. కామ్ జోంగ్ (Kamjong) జిల్లాలో 66 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది.
భూకంపం తర్వాత ఎటువంటి నష్టం జరిగినట్టు అధికారిక నివేదికలు లేనప్పటికీ తౌబాల్ (Thowbal) జిల్లాలో అనేక భవనాలకు పగుళ్లు ఏర్పడినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఓ పాఠశాలలో ఘర్షణల వల్ల నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. సోషల్ మీడియా (Social media) లో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. మణిపూర్ ప్రకంపనల ప్రభావంతో అసోం (Assam), మేఘాలయాల (Meghalaya)లోని కొన్ని ప్రాంతాల్లోనూ స్వల్ప ప్రకంపనలు వచ్చినట్టు సమాచారం. కాగా, ఇప్పటికే జాతి హింసతో అట్టుడుకుతున్న రాష్ట్రంలో ప్రకంపనలు రావడంతో ప్రజల తీవ్ర భయాందోళనకు గురయ్యారు.






