Earthquake: గ్రీస్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతగా నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-14 05:35:38  IST  )

గ్రీస్‌ (Greece)లోని క్రీట్ దీవి (Crete Island) సమీపంలో భూకంపం సంభవించింది.

Earthquake: గ్రీస్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతగా నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రీస్‌ (Greece)లోని క్రీట్ దీవి (Crete Island) సమీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు (Richter Scale)పై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లుగా జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (German Research Center for Geosciences) తెలిపింది. అదేవిధంగా భూకంపం 83 కి.మీ లోతులో ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈజిప్ట్‌లోని ఉత్తర తీరాల నుంచి 431 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపారు. భూప్రకంపనల ధాటికి భవనాలు, ఇళ్లు కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈజిప్టులోని కైరోతో పాటు ఇజ్రాయెల్‌, లెబనాన్‌, తుర్కియే, జోర్డాన్‌లోనూ భూప్రకంపనలు వచ్చాయి. భూకంపంతో ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని గ్రీస్ ప్రభుత్వం తెలిపింది. సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని తీరం వెంట ఉన్న ప్రజలు వెంటనే అక్కడి నుంచి స్థానిక అధికారులు హెచ్చరించింది.

Click For Tweet..

Next Story