Earthquake: అసోంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం

by Kema Shiva Kumar |

వరుస భూకంపాలు దేశంలోని ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి.

Earthquake: అసోంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస భూకంపాలు దేశంలోని ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే అసోం (Assam)లోని మోరిగావ్‌ కేంద్రంగా ఇవాళ ఉదయం తెల్లవారుజామున 2.25 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది. అయితే, భూకంపం (Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రత నమోదైనట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) తెలిపింది. భూమి లోపల సుమారు 16 కి.మీ లోతున భూకంపం సంభవించినట్లుగా అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, అసోంలో సంభవించిన భూకంపం చాలా చిన్నదిగానే పరిగణిస్తారని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) అధికారులు ప్రకటించారు.

కాగా, బుధవారం ఉదయం 6.55 గంటలకు ఇండోనేషియా (Indonesia) దేశంలోని సులవేసి (Sualvesi) ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1 తీవ్రత నమోదైంది. ఆకస్మాత్తుగా భూమి కంపించడంతో జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరగుతోందని తెలుసుకునే లోపే ప్రణాలు కాపాడుకునేందుకు అంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (United States Geological Survey) అధికారులు వెల్లడించారు. అదేవిధంగా సునామీ (Tsunami) వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు.

Next Story