Earthquake: గ్రీస్‌లో మరోసారి భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

by Kema Shiva Kumar |

వరుస భూకంపాలు గ్రీస్‌ (Greece)ను భయపెడుతున్నాయి.

Earthquake: గ్రీస్‌లో మరోసారి భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస భూకంపాలు గ్రీస్‌ (Greece)ను భయపెడుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున 1.51 గంటలకు (ఈస్టర్న్ యూరోపియన్ టైమ్) ప్రకారం గ్రీస్‌లోని కాసోస్ దీవి (Cassos Island) సమీపంలో శక్తివంతమైన భూకంపం (Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. భూకంప కేంద్రం ఫ్రై, గ్రీస్‌కు ఆగ్నేయంగా 14 మైళ్ల దూరంలో 62.5 కి.మీ లోతులో సంభవించినట్లుగా పేర్కొన్నారు.

అయితే, క్రీట్, రోడ్స్, కోస్, తూర్పు మధ్యధరా ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగనట్లుగా తెలుస్తోంది. గ్రీస్ మంత్రిత్వ శాఖ క్లైమేట్ క్రైసిస్ అండ్ సివిల్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ కార్పాథోస్ (Karpathos), కాసోస్‌ (Cassos)లలో నివాసం ఉండే ప్రజలకు తీర ప్రాంతాల నుంచి ఖాళీ చేయాలంటూ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. గ్రీస్ ఎర్త్‌క్వేక్ ప్లానింగ్ అండ్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఎఫ్తిమియోస్ లెక్కాస్ (Efthymios Lekkas) మాట్లాడుతూ.. భూకంపం లోతు కారణంగా ఉపరితలంపై ప్రభావం తగ్గిందని పేర్కొన్నారు.

Next Story