Earthquake: అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ!

by Kema Shiva Kumar |   (  Updated:2024-12-06 01:44:58  IST  )

అమెరికా (America)లోని ఉత్తర కాలిఫోర్నియా (Northern California) తీర ప్రాంతంలో భారీ భూ ప్రకంపం సంభంవించింది.

Earthquake: అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా (America)లోని ఉత్తర కాలిఫోర్నియా (Northern California) తీర ప్రాంతంలో భారీ భూ ప్రకంపం సంభంవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.44 ప్రాంతం భూ ప్రకంపనలు సంభవించినట్లుగా అమెరికా ల్యాండ్ సర్వే విభాగం (Land Survey Department) అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే నిపుణులు తొలుత సునామీ హెచ్చరికలు జారీ ఆ తరువాత ఉపసంహరించారు. శాన్‌ ఫ్రాన్సిస్కో (San Francisco)‌కు 418 కి.మీ దూరంలో ఫెర్న్‌డేల్ (Ferndale) పట్టణంలో భూ ప్రకంపనల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా పెట్రోలియా (Petrolia), స్కాటియా (Scotia), కాబ్ (Cobb) తదితర ప్రాంతాల్లో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి. భూకంపం ప్రభావంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమికంగా తెలుస్తోంది.

Next Story