Breaking: పాకిస్థాన్‌లో భూకంపం!

by Ajay Maddhiboyina |

ఇండియా పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ ఆ దేశంలో భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.2 పాయింట్లుగా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.

Breaking: పాకిస్థాన్‌లో భూకంపం!
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ ఆ దేశంలో భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.2 పాయింట్లుగా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు పాకిస్థాన్‌లో భూమి కంపించిందని ఎన్‌సీఎస్ అధికారులు ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. పహల్గామ్‌లో ఉగ్రదాడి (Pahalgam terror attack) వెనుక ఆ దేశ రక్షణశాఖ కూడా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. పాక్ రక్షణ మంత్రే స్వయంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. దీంతో భారత్ ఆ దేశంపై సీరియస్‌గా ఉంది. ఎప్పుడు దాడి చేస్తారో అని దాయాది దేశం బిక్కు బిక్కు మంటోంది. ఇలాంటి సమయంలో భూకంపం సంభవించడం ఆ దేశానికి షాక్ అనే చెప్పాలి.

Next Story