- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెచ్చగొడితే తాటతీస్తాం.. యూఎస్, ఈయూలకు స్పష్టం చేసిన జైశంకర్
యూఎస్ స్టేట్ సెక్రటరీ, యూరోపియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్‌తో ఫోన్‌లో సంభాషించిన జైశంకర్. పాక్ రెచ్చగొడితే చూస్తూ ఊరుకోమని స్పష్టం.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-పాక్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడిన యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు కూడా ఫోన్ చేశారు.
రెచ్చగొడితే ఊరుకోం..
‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ కేవలం టెర్రరిస్టు స్థావరాలనే టార్గెట్ చేసిందని మార్క్ రుబియోకు జైశంకర్ చెప్పారు. ‘ఉగ్రవాదంపై పోరులో యూఎస్ మద్దతుకు ధన్యవాదాలు. క్రాస్-బోర్డర్ ఉగ్రవాదంపై మా చర్యలను ఆయనకు వివరించడం జరిగింది. మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తే సమాధానం గట్టిగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది’ అని తమ ఫోన్ సంభాషణను జైశంకర్ వెల్లడించారు. యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షురాలు కజా కల్లాస్‌కు కూడా జైశంకర్ ఇదే విషయం చెప్పారు.
భారత్‌కే యూఎస్, ఈయూ మద్దతు
జైశంకర్‌తో ఫోన్‌లో సంభాషించిన మార్క్ రుబియో పహల్గాం ఉగ్రదాడికి సానుభూతి తెలిపారని, అలాగే ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారని యూఎస్ ప్రకటించింది. ఈయూ కూడా ఉగ్రవాదం నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడుకునే హక్కు ప్రతిదేశానికీ ఉంటుందని స్పష్టం చేసింది. పహల్గాంలో జరిగిన అత్యంత క్రూరమైన ఉగ్రవాద చర్యను ఖండిస్తున్నామని ప్రకటించింది.






